గిన్నిస్ బుక్ ఎక్కిన ఆడియో ఆవిష్కరణ

Varma
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు, ఇప్పుడు కాదేదీ గిన్నిస్ బుక్ కి అనర్హం అని నిరూపించారు మన సినీ వర్గాలు. ఇంతకీ విషయం ఏమిటంటే బొక్కా నరేంద్ర రెడ్డి నిర్మాణలో ఖాజా పాషా దర్శకత్వం వహిస్తున్న “డాటర్ ఆఫ్ వర్మ” సినిమా నారాయణమ్మ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలో 1000 మంది విద్యార్ధుల చేతుల మీదగా ఆడియో విడుదల జరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

1016 ఒకేసారి చాక్లేట్ తినడంతో అక్కడే లిమ్కా బుక్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ వేడుకకి ముఖ్య అధితులుగా కృష్ణం వందే జగద్గురుం నిర్మాతలు సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, ‘గాయం 2’ డైరెక్టర్ ప్రవీణ్ సాయి పాలుగున్నారు. ముందుగా ‘డాటర్ ఆఫ్ రాంగోపాల్ వర్మ’ అని అనుకున్న ఈ టైటిల్ వివాదాస్పదం కావడంతో ‘డాటర్ ఆఫ్ వర్మ’గా పేరు మార్చారు. ఈ సినిమాకి ఆదెశ రవి సంగీతం అందించాడు.

Exit mobile version