ఈ వారంలోనే ‘గుండెల్లో గోదారి’ ఆడియో

ఈ వారంలోనే ‘గుండెల్లో గోదారి’ ఆడియో

Published on Oct 15, 2012 12:30 PM IST


లక్ష్మీ మంచు ముఖ్య పాత్ర పోషిస్తూ మరియు స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘గుండెల్లో గోదారి’. ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 17న జరగనుంది. ఈ ఆడియో వేడుక ఎక్కడ జరగనుంది మరియు ముఖ్య అతిధిలుగా ఎవరెవరు రానున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తారు. నవంబర్లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒక నవలా ఆధారంగా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బృందాన్ని ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు.

1986లో వచ్చిన గోదావరి వరదల నేపధ్యంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం కోనసీమలో చిత్రీకరించారు మరియు వరదలు వచ్చే సన్నివేషాలను తీయడం కోసం ప్రత్యేకమైన ఒక భారీ సెట్ ను నిర్మించారు. లక్ష్మీ మంచుతో పాటు ఈ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయం కానున్నారు.

తాజా వార్తలు