తన సినిమాలో ఎంత డబ్బయినా ఆలోచించకుండా ఖర్చుపెట్టి కళ్ళుచెదిరే రీతిలో సెట్ లను, కాస్ట్యూమ్ లను మనకు చూపించడం గుణశేఖర్ అలవాటు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘రుద్రమదేవి’ సినిమా తీసే పనిలో వున్నాడు. భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియో స్కోప్ 3D సినిమాగా ఇప్పటికే ఇది చరిత్రలో నిలిచింది.
ఈ సినిమాలో అనుష్క ప్రధానపాత్రధారి. ఇందులో ఆమె ధరించే దుస్తులపై ఎంతో అవగాహన చేస్తున్నారు. పురాతన కధను ప్రతిబింబించేలా తోట తరుణి చాలా కష్టపడుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాజసం వుట్టిపడదానికి అనుష్క కిరీటం మరియు ఆభరణాలకు నిజమైన బంగారాన్ని వాడుతున్నారట. 3డి లో తీస్తున్న ఈ సినిమాలో రానా, నిత్యా మీనన్, కేథరీన్ త్రేస, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు
ఇళయరాజా సంగీతదర్శకుడు. ఈ సినిమా 2014లో మనముందుకు రానుంది