రుద్రమదేవిలో రాణిగా నటాలియ కౌర్

రుద్రమదేవిలో రాణిగా నటాలియ కౌర్

Published on Apr 2, 2013 5:40 AM IST

Nathalia
భారీ సెట్లతో, భారీ బడ్జెట్లతో, భారీ సినిమాలు తీసే దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రం ‘రుద్రమదేవి’లో నటాలియ కౌర్ ని ఒక పాత్రకోసం ఎంపిక చేసుకున్నాడు. సరికొత్త కధనాల ప్రకారం నటాలియ భారతీయ రాణిగా ఈ చారిత్రాత్మక సినిమాలో కనబడనుంది. అంతగా విజయం సాధించని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డిపార్టుమెంట్’ సినిమాలో నటాలియ ఒక ఐటెం సాంగ్ చేసి, మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గుణశేఖర్ తీస్తున ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నటాలియ ఎంపిక నిజంగానే ఆసక్తి కలిగించే విషయం. అనుష్క ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి అనుష్క భర్తగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి రచయిత, దర్శకుడు, నిర్మాత గుణశేఖరే కావడం మరో విశేషం.

తాజా వార్తలు