కెరీర్ మొదట్లో పౌరాణిక మరియు కమర్షియల్ సినిమాలను తీసి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్ గత కొంత కాలంగా హిట్ లేక వరుసగా ‘సైనికుడు’,’వరుడు’ మరియు ‘నిప్పు’ రూపంలో హట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నారు. అర్జున్ సినిమా తర్వాత నుంచి గుణ శేఖర్ కాకతీయులకి గర్వ కారణంగా మారిన ‘రుద్రమ దేవి’ జీవితాన్ని సినిమాని తీయాలనుకుని పలు సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన రుద్రమదేవి సినిమా త్వరలోనే కార్య రూపం దాల్చనుంది. ఆ వివరాల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ ఎన్నో హిట్స్ అందుకున్నప్పటికీ దర్శకుడిగా నాకు ఏమాత్రం తృప్తి లేదు నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు నేనింకా నా స్థాయికి తగ్గ సినిమా తీయలేదు. ఈ సినిమా నాకు దర్శకుడిగా సంతృప్తి అందిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం రీసర్చ్ చేసి మరీ కథని తయారు చేశాము. ఈ సినిమా కోసం మొదటి సారిగా మాస్ట్రో ఇళయరాజా గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగానూ మరియు ఉత్సాహంగానూ ఉంది. రుద్రమ దేవి పాత్రను అనుష్క చేయనున్నారని’ అన్నారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. స్వయంగా గుణశేఖర్ గారే గుణా టీం వర్క్స్ అనే సంస్థ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
నా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయాను
నా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయాను
Published on Nov 6, 2012 10:30 PM IST
సంబంధిత సమాచారం
- యూత్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ‘బాలయ్య’ ఇంట్రో సీన్స్ కోసం కసరత్తులు !
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌లోనే ఔట్
- ఇంటర్వ్యూ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ‘కిష్కింధపురి’ థియేటర్స్‌లో అదిరిపోతుంది..!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో కన్నడ నటుడు ?
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!