గుమ్మడి నర్సయ్య బయోపిక్: శివ రాజ్ కుమార్ మోషన్ పోస్టర్‌పై శ్యామలా దేవీ ప్రశంసలు

గుమ్మడి నర్సయ్య బయోపిక్: శివ రాజ్ కుమార్ మోషన్ పోస్టర్‌పై శ్యామలా దేవీ ప్రశంసలు

Published on Nov 3, 2025 8:00 AM IST

ప్రజా జీవితంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం ఒక సాహసంతో కూడుకున్న ప్రయత్నం. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, యువ దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గుమ్మడి నర్సయ్య పాత్రలో ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ (శివన్న) నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శివ రాజ్ కుమార్ ఆ పాత్రలో ఎలా ఒదిగిపోతారోనన్న సందేహాలను ఈ పోస్టర్ పటాపంచలు చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను వీక్షించిన శ్యామలా దేవీ గారు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “ఈ మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉంది. సినిమా స్థాయిని ఇది తెలియజేస్తోంది. శివ రాజ్ కుమార్ గారు పాత్రకు ప్రాణం పోశారు. చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆమె చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత సురేష్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల కెమెరామెన్‌గా, సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడిగా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.

తాజా వార్తలు