మే 3వ తేదికి వాయిదాపడిన గ్రీకువీరుడు చిత్రవిడుదల

First Posted at 20.00 on Apr 18th

greeku_veerudu

నాగార్జున నటించిన సరికొత్త సినిమా ‘గ్రీకువీరుడు’ విడుదల మే 3వ తేదికి వాయిదాపడింది. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 26కి విడుదల చేద్దామని అనుకున్నారు. నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి ఏప్రిల్ 26న రిలీజ్ ఖాయం అని తెలిపారు. కానీ మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మే 3కి వాయిదాపడింది.

ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నాగార్జునకు జంటగా నయనతార నటించింది. ఈ సినిమా దశరధ్ దర్శకత్వంలో, కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నాడు. నాగార్జున ఈ సినిమాలో ఈవెంట్ మేనేజర్ పాత్ర పోషించాడు. మీరా చోప్రా, బ్రహ్మానందం మరియు ఎం. ఎస్ నారాయణ ముఖ్య పత్రాలు పోషించారు. థమన్ సంగీతం, నేపధ్య సంగీతం అందించడం పూర్తయింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది. అనీల్ భండారి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్

Exit mobile version