తమిళ్ లో అనువాదం కానున్న గ్రీకువీరుడు

తమిళ్ లో అనువాదం కానున్న గ్రీకువీరుడు

Published on Apr 7, 2013 4:07 AM IST

greeku_veerudu

నాగార్జున నయనతార జంటగా నటిస్తున్న ‘గ్రీకువీరుడు’ సినిమా తమిళ్ లోకి అనువాదం కానుంది. తమిళ్ వెర్షన్ టైటిల్ ‘లవ్ స్టొరీ’గా నిర్ణయించారు. దీన్ని కుడా తెలుగు వెర్షన్ తో పాటే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అనువాద హక్కులను గురు బ్రహ్మ ఫిల్మ్స్ సంస్థ సంపాదించుకుంది. ఎ.పి.కె రాజరాజా తమిళ్ వెర్షన్ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. నయనతార కోలీవుడ్లో పెద్ద తార కాగా నాగార్జున ‘పయనం’ మరియు ‘రచ్చగన్’ సినిమాల ద్వారా అందరికీ పరిచయస్తుడే

ఈ సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యి శ్రోతలనుండి మంచి స్పందన వస్తుంది. దశరధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.మీరా చోప్రా, ఎం.ఎస్ నారాయణ, బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఒక ఈవెంట్ మానేజర్ గా పని చేస్తూ ఇండియాకి వచ్చిన నాగార్జున అక్కడ నయనతారను కలిసాక తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులే ఈ సినిమా కధాంశం. ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న మన ముందుకురానుంది.

తాజా వార్తలు