త్వరలో తమిళ్లో విడుదల కాబోతున్న ‘పంజా’

త్వరలో తమిళ్లో విడుదల కాబోతున్న ‘పంజా’

Published on May 28, 2012 10:15 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ చిత్రాన్ని తమిళ్లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం విదితమే. తమిళ్లో ‘కురి’ పేరుతో డబ్ చేస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు విష్ణు వర్ధన్ తమిళంలో బిళ్ళ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించడం, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకి తమిళంలో సూపర్ క్రేజ్ ఉండటం, సారా జేన్ డియాజ్ కూడా తమిళంలో పలు సినిమాల్లో నటించడంతో ఈ సినిమా పై క్రేజ్ ఏర్పడింది. అంజలి లావణ్య మరో హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని శోభు మరియు నీలిమ తిరుమల శెట్టి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు