నేడే ‘లవ్లీ’ విడుదల


బి. జయ డైరెక్షన్లో ఆది హీరోగా, శాన్వి అనే అనే కొత్త అమ్మాయిని హీరొయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘లవ్లీ’. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ రోజే విడుదలవుతుంది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ పిఆర్ఓ బిఎ రాజు నిర్మించారు. కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రత్యేక ప్రివ్యూ వేయగా ప్రతి ఒక్కరు సినిమా బావుంధంటూ పొగిడారు. గతంలో ప్రేమ కావాలి అనే చిత్రం ద్వారా పరిచయమైన ఆది మొదటి చిత్రంతోనే విజయం అందుకున్నాడు. రెండవ చిత్రం కూడా అంతటి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే మహేష్ బాబు విడుదల చేయగా పాటలు కూడా హిట్టయ్యాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం టర్కీ మరియు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

Exit mobile version