జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘యముడు’ ఆడియో లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ చిత్రానికి ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయికగా నటించారు.
ఈ కార్యక్రమంలో ప్రియాంక, మల్లిక మొదటి పాటను, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రెండో పాటను, కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక మూడో పాటను, మల్లిక నాలుగో పాటను విడుదల చేశారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘‘చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘యముడు’ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జగదీష్ కష్టపడి ఈ సినిమా తీశారు,’’ అన్నారు.
హీరో, దర్శకుడు జగదీష్ ఆమంచి మాట్లాడుతూ, ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను,’’ అన్నారు.
హీరోయిన్ శ్రావణి శెట్టి, ‘‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది,’’ అన్నారు.