కాంత టీజర్ టాక్ : నట చక్రవర్తిగా దుల్కర్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ సాలిడ్ హిట్స్ అందుకుని ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. కాంత అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

కాగా, నేడు దుల్కర్ బర్త్ డే కానుకగా కాంత చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. తెలుగు సినిమా తొలినాళ్లలో ఈ కథ సాగుతున్నట్లు మనకు చూపెట్టారు. ‘శాంత’ అనే ఓ హార్రర్ సినిమాను తెరకెక్కించే క్రమంలో దుల్కర్ సల్మాన్ జీవితంలో జరిగే కథగా ఈ సినిమాను మనకు చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఆయనకు గురువుగా ఉన్న సముద్రఖనికి ధీటుగా తాను ఈ సినిమాను తెరకెక్కించాలని దుల్కర్ ప్రయత్నిస్తాడు. ఇక ఈ క్రమంలో ఆయన చేసే పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు మనకు ఈ టీజర్‌లోనే హింట్ ఇచ్చారు.

ఈ సినిమాతో మరోసారి దుల్కర్ యాక్టర్‌గా ఎందుకు బెస్ట్ అనేది మనకు నిరూపించబోతున్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జాను చంతార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version