మాసివ్‌గా దూసుకెళ్తున్న ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్స్

ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ బ్యానర్ నుంచి రీసెంట్‌గా ఓ యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొద్దిరోజులకే ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేటెడ్ సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

డివోషనల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో, తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ, ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాకు క్రమంగా ఆదరణ కూడా పెరిగింది. దీంతో కేవలం ఆదివారం నాడు ఒక్కరోజే ఈ చిత్రానికి ఏకంగా రూ.11.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి పోటీనిస్తూ ఈ యానిమేషన్ సినిమా దూసుకెళ్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ సినిమాతో హొంబాలే ఫిలింస్ సాలిడ్ సక్సెస్ అయితే అందుకుందని చెప్పాలి.

Exit mobile version