భారీ విడుదలకు సిద్దమయిన మిర్చి ఆడియో

భారీ విడుదలకు సిద్దమయిన మిర్చి ఆడియో

Published on Jan 5, 2013 2:00 PM IST

mirchi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో “మిర్చి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ఆడియో ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. నానాక్రంగూడ వద్ద ఉన్న రామానాయుడు స్టూడియోస్లో ఈ వేడుక జరగనుంది. పరిశ్రమ పెద్దలు అందరు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రమోద్ రెడ్డి మరియు వంశీ కృష్ణ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు