మెగాస్టార్ ‘ఆచార్య’ కోసం మరో సెట్ ?

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టకపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వర్క్ ను మొదలుపెట్టారట. ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయం సెట్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఈ సెట్ పూర్తవ్వడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని.. అప్పటిలోగా కరోనా ప్రభావం తగ్గితే.. ఈ సెట్ లో తిరిగి షూట్ ను మొదలుపెట్టొచ్చు అని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version