నాని అలా మొదలైంది రీమేక్లో గౌతమ్ కార్తీక్?

నాని అలా మొదలైంది రీమేక్లో గౌతమ్ కార్తీక్?

Published on Apr 2, 2013 3:01 AM IST

gautham-karthik
యంగ్ హీరో నానికి బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా ‘అలా మొదలైంది’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తమిళంలో రిమేక్ చెయ్యనున్నారు. కోలీవుడ్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. మొదటి సినిమా హిట్ కాకపోయినా నటన పరంగా పరవాలేదనిపించుకున్న గౌతమ్ కి ఈ సినిమా చేసే అవకాశం రావడం చెప్పుకోదగిన విషయం.

రవి త్యాగరాజన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయ్యి నానికి బ్రేక్ ఇచ్చిన ‘అలా మొదలైంది’ సినిమా తమిళంలో కూడా విజయం సాదించి గౌతమ్ కి బ్రేక్ ఇస్తుందో లేదో అనే దానికోసం, నాని పాత్రకి గౌతమ్ ఎంత వరకూ న్యాయం చేయగలడా అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే?

తాజా వార్తలు