శిరీష్ ,యామి గౌతం జంటగా నటించిన ‘గౌరవం’ తమిళనాడు లో పెద్ద వివాదంలో చిక్కుకుంది . ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ‘గౌన్దర్ ‘ అనే కుల సంఘం ఈ చిత్రం ధర్మరి జిల్లా లో ఉద్రిక్తత సృష్టించినందువల్ల ఈ చిత్రాన్ని నిషేదించాలని పట్టుబట్టింది . గత ఏడాది ఈ జిల్లా లో ఇంకా మనిగందన్ జిల్లా లో కుల ఘర్షణలు జరిగాయి . ఈ చిత్ర నిషేధాన్ని కోరుతున్న ఆ కుల సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతూ ‘ ఈ ట్రైలర్ అగ్రవర్ణాలు గౌరవం పేరుతో ‘హానర్ కిల్లింగ్స్ ‘ చేస్తారు అంటూ చెడుగా చిత్రీకరిస్తుంది దీనివల్ల ప్రేక్షకుల దృష్టిలో చెడ్డ అభిప్రాయం ఏర్పడవచ్చు అలాగే ప్రజల్ని హింసాత్మకమైన చర్యలకి పాల్పడేలా ప్రేరేపించవచ్చు .ఇదిలా వుండగా దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ ఈ ఆరోపల్ని కొట్టిపారేసారు. ఒక ప్రధాన వార్త పత్రిక తో మాట్లాడుతూ ఈ చిత్రనికి ధర్మపురి జిల్లా గొడవలకి సంబంధం లేదు .
ఒక చిత్రాన్ని నిషేదించమని ఒక గ్రూపు ముందుకి రావడం ఇదే మొదటి సారి కాదు .ఈ ఏడాది మొదట్లో చాలా ముస్లిం సంస్థలు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కమల్ హాసన్ ‘విశ్వరూపం ‘ చిత్రాన్ని నిషేదించాలని కోరుతూ పది రోజులపాటు ఈ చిత్ర విడుదలని నిలిపివేశారు . ‘గౌరవం ‘ నిషేధం పై ప్రభుత్వం ఇంకా స్పందించకపోయిన ఇంకా ఈ చిత్రం పై నిరసనలు ఎప్పటివరకు ఉంటాయో చూడాలి . శిరీష్ ఈ చిత్రం తో పరిచయం కాబోతున్నాడు . ఈ చిత్రం ‘హానర్ కిల్లింగ్స్ ‘ కధంసాంగా రూపొందుతుంది . ఒక పట్టణ యువకుడు ఈ సామజిక ఉపద్రవాన్ని నిర్మూలించడానికి ఎలా కృషి చేసాడు అనేది కథ . ప్రకాశ్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఒక ముఖ్య పాత్ర పోషించారు . తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది .