“హరిహర వీరమల్లు సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే ఉంటుందట. ఇప్పుడు నిధి అగర్వాల్ కి మరో క్రేజీ ఛాన్స్ దొరికిందట. తమిళ హీరో సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా ? అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పారు. ఏ గెటప్ లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు.
ఈ సినిమా జూన్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఐతే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. రెండో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత. అన్నట్టు ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. “హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర విషయానికి వస్తే.. ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ అని, స్వతంత్రురాలు అని. సినిమాలో పంచమికి ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది.