రేపు ప్రారంభంకానున్న గోపీచంద్ కొత్త సినిమా

రేపు ప్రారంభంకానున్న గోపీచంద్ కొత్త సినిమా

Published on Apr 10, 2014 11:10 PM IST

gopichand
గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తన తదుపరి చిత్రంతో మనముందుకు రానున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా రేపు ఉదయం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభంకానుంది. ఈ వేడుకకు ప్రధాన తారలు హాజరయ్యే అవకాశం వుంది

గత ఏడాది సాహసం సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న ఈ నటుడు తదుపరి సినిమాలో బి గోపాల్ దర్శకత్వంలో నటించాల్సివుంది. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ కి కామా పెట్టి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత హీరోయిన్ గా నటిస్తున్న రాకుల్ ప్రీత్ కి ఇది పెద్ద సినిమాగా నిలవనుంది

ఈ సినిమాకు సంబంధిచిన ఆడియో సిట్టింగ్ లో దర్శకుడు అనూప్ రూబెన్స్ తో కలిసి పాల్గున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతాం

తాజా వార్తలు