ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సంపత్ నంది తో మరో సినిమా “సీటీమార్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే వరుస విజయ చిత్రాల దర్శకుడు మారుతితో మరో సినిమాను టేక్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాకు గాను మేకర్స్ మొదటి నుంచీ వినూత్నంగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే నిన్న ఈ రోజు ఈ చిత్రం తాలూకా ముహూర్తం స్టార్ట్ చెయ్యడమే కాకుండా టైటిల్ ను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ నే పెట్టారు. ఈసారి గోపీచంద్ మళ్ళీ అవుట్ అండ్ అవుట్ పక్కా ఎంటర్టైనర్ తో వస్తున్నట్టే అర్ధం అవుతుంది.
“పక్కా కమర్షియల్” అనే టైటిల్ తో ఇందులో గోపీచంద్ రోల్ ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది. గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ మార్చ్ 5 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసుకోనుండగా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి విడుదల చెయ్యడానికి డేట్ లాక్ చేసేసారు.