‘ఘాజీ’ దర్శకునితో ఆసక్తి రేపుతున్న గోపీచంద్ హిస్టారికల్ సినిమా గ్లింప్స్!

‘ఘాజీ’ దర్శకునితో ఆసక్తి రేపుతున్న గోపీచంద్ హిస్టారికల్ సినిమా గ్లింప్స్!

Published on Jun 12, 2025 11:00 AM IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గత ఏడాది విశ్వం సినిమాతో క్లీన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా తర్వాత ఘాజీ, అంతరిక్షం లాంటి వినూత్న సినిమాలు తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో ఓ భారీ హిస్టారికల్ డ్రామా తాను చేస్తున్నారు. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా గోపీచంద్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో గోపీచంద్ డైనమిక్ గా వారియర్ లుక్ లో కనిపిస్తుండగా గ్లింప్స్ కూడా చాలా బాగుంది. సింపుల్ విజువల్స్ తోనే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ భారీ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు భారతదేశ చరిత్రలో మర్చిపోయిన అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ ముందు రానున్నాయి.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు