గోపీచంద్ రేటు పెంచాడా??

గోపీచంద్ రేటు పెంచాడా??

Published on Jul 17, 2013 12:05 AM IST

GopiCHand
‘సాహసం’ సినిమా విజయం సాధించాక హీరో గోపీచంద్ ప్రస్తుతం తన భవిష్యత్ ప్రాజెక్ట్ల మీద దృష్టి పెట్టనున్నాడు. ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకోవాదానికి తెగ ప్రయత్నిస్తున్న ఈ హీరో ఎట్టకేలకు అనుకున్న పని సాధించాడు. తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం గోపీచంద్ భవిష్యత్ ప్రాజెక్ట్లకు తన రెమ్యునరేషన్ పెంచాడట.

ఆరడుగుల ఎత్తు మంచి దేహధారుడ్యం కలిగిన గోపీచంద్ ప్రస్తుతం బి. గోపాల్ మరియు దేవకట్టా వంటి దర్శకులతో పనిచేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్ట్లతో కధా చర్చలు జరుగుతున్నా అవి ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. మరో రెండు నెలలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ‘సాహసం’ సినిమాకు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా ఏ సెంటర్లలో మరియు అమెరికాలో మంచి స్పందనతో నడుస్తుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు