క్లైమాక్స్ చిత్రీకరణలో గోపీచంద్ చిత్రం

క్లైమాక్స్ చిత్రీకరణలో గోపీచంద్ చిత్రం

Published on Dec 16, 2012 5:55 PM IST

gopichand-and-yeleti
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రానున్న అడ్వెంచర్ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్లో మొదలయ్యింది. ఈ తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను మరియు కొన్ని ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గతంలో లడక్ లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం నిధిని కనుక్కోడానికి ఒక సాధారణ యువకుడి ప్రయాణం గురించి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ మీద బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మధ్యలో విడుదల కానుంది. గోపీచంద్ నటిస్తున్న చిత్రం ఇది ఒక్కటే తాప్సీ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుండగా కొన్ని చిత్రాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు