అక్కినేని నాగార్జున నటించిన ‘సంతోషం’ సినిమాతో స్క్రీన్ ప్లే రచయితగా తెలుగు వారికి పరిచయమైన గోపీ మోహన్ ఆ తర్వాత ‘వెంకీ’, ‘డీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘దూకుడు’, ‘దేనికైనా రెడీ’, ‘బాద్షా’ సినిమాలతో మంచి రైటర్ గా, స్క్రీన్ ప్లే రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫుల్ డిమాండ్ ఉన్న గోపీ మోహన్ మరి కొద్ది రోజుల్లో మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారనున్నాడు. మళ్ళ విజయ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి హీరో ఇంకా ఖరారు కాలేదు.
మీరు రైటర్ గా ఉండగా ఏదైనా నచ్చని కారణం వల్ల డైరెక్టర్ అవుతున్నారా? అలాగే డైరెక్టర్ కావాలంటే ఏమేమి ఉండాలి అని? అడిగితే ‘రైటర్ గా ఏదో ఇబ్బందులు ఉన్నాయని డైరెక్టర్ అవడంలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదామని, కానీ అప్పట్లో నాకు డైరెక్షన్ అంటే పెద్దగా తెలియదు. కానీ రైటర్ గా మారి పేరు, అనుభవాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు డైరెక్షన్ పై పూర్తి అవగాహన వచ్చింది కాబట్టే డైరెక్టర్ అవుతున్నాను. ఒక రైటర్ ఎంత మంచి స్టొరీ రాసిన దాన్ని డైరెక్టర్ తీసే విధానం మీదే ఆ సినిమా జయాపజయాలు ఉంటాయి. అందుకే స్క్రీన్ ప్లే మీద పట్టున్న వారే డైరెక్టర్ కాగలడని’ గోపీ మోహన్ సమాధానం ఇచ్చాడు.