ఎటో వెళ్లిపోయింది మనసు టీజర్ కి స్పందన చాలా బాగుంది


నాని మరియు సమంత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ” ఎటో వెళ్లిపోయింది మనసు”. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం యొక్క ఫస్ట్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు మరియు ఈ టీజర్ కి మంచి స్పందన వస్తోంది. సోషల్ వెబ్ సైట్స్ లో యూత్ అంతా టీజర్ చాలా బాగుందని మరియు విసువల్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. ఆగష్టు చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్న ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతోంది మరియు రెండు భాషల్లోనూ సమంత కథానాయికగా నటిస్తోంది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ ఏమాయ చేసావే ‘ చిత్రం ద్వారా సమంత తెలుగు వారికి పరిచయమయ్యారు. అలాంటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో విజయం సాదిస్తుందని మరియు మంచి పేరు తెచ్చిపెట్టె చిత్రం అవుతుందని సమంత భావిస్తోంది.

Exit mobile version