గత కొన్ని వారాల నుంచి మన దేశపు లెజెండరీ గాయకులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కోవిడ్ వైరస్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లోనే ఆయన ఆరోగ్యంకు సంబంధించి ఎన్నో రకాల అప్డేట్ లు బయటకొచ్చాయి. ఒకసారి ఆయన ఆరోగ్యం బాగుంది అని మరొకసారి బాలేదు అని ఇలా ఎన్నో షాకింగ్ వార్తలు బయటకు రావడంతో ఆయనకేం కాకూడదని ఎంతో మంది అభిమానులు పూజలు చేసారు.
ఎందరో సినీ తారలు మొక్కుకున్నారు. ఇపుడు వారికి మరియు ఎన్నో గంటల పాటు ఆయన ఆరోగ్యంపై పని చేస్తున్న వైద్యల కృషికి ఫలితం దక్కనుంది అని బాలు గారి తనయుడు తాజా అప్డేట్ ద్వారా తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి నాన్నగారి ఆరోగ్యం మెరుగవుతుంది అని అన్ని సరిగ్గా ఉన్నట్టయితే వచ్చే సోమవారం నాడు ఆయన పూర్తిగా కోలుకున్నారని శుభవార్త మనమందరం వింటాము అని ఆయన తెలిపారు. మరి ఆయన మరింత తొందరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.