‘నాయక్’ టైటిల్ లొల్లి మొదలైంది

‘నాయక్’ టైటిల్ లొల్లి మొదలైంది

Published on Dec 25, 2012 3:36 PM IST

Naayak

సినిమా టైటిల్స్ విషయంలో వివాదాలు జరగడం కొత్తేమీ కాదు. తాజాగా ఈ టైటిల్ గొడవ ‘నాయక్’ సినిమాని కూడా తాకింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్ధుల సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్ధి సంఘాల నాయకులూ మాట్లాడుతూ ‘నాయక్’ రాజ్యాంగం తమ గిరిజనులకు హక్కుగా ఇచ్చిందని, ఇప్పుడు ఈ పదాన్ని ఈ సినిమాకి వాడుకోవడం తమని అవమానించినట్లుగా ఉందని అన్నారు. గతంలో కొమరం పులి అనే సినిమా విషయంలో ఇలాగే జరిగితే కొమరం అనే పదాన్ని తొలగించారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాయక్ అనే టైటిల్ మార్చాలని లేని పక్షంలో సినిమాని అడ్డుకుంటామని అన్నారు. సినిమా టైటిల్ విషయాల్లో వివాదాలు తలెత్తడం గతంలో ఖలేజా, కొమరం పులి, ఢమరుకం సినిమాల విషయంలో చూసాము. ఈ మూడు సినిమాలకి టైటిల్స్ చిన్న మార్పుతో మార్చారు.మరి నాయక్ విషయంలో ఎం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు