ఒక వారం వాయిదా పడ్డ రెండు సినిమాలు

ఒక వారం వాయిదా పడ్డ రెండు సినిమాలు

Published on Dec 19, 2012 9:29 PM IST

Vetadu-ventadu-and-genius
టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి సినిమా ‘జీనియస్’ డిసెంబర్ 21న విడుదల కావాల్సి ఉండగా ఒకవారం వాయిదా పడి డిసెంబర్ 28న విడుదలవుతుంది. మరోవైపు విశాల్ ద్విపాత్రాభినయంలో నటించిన సమర్ చిత్రాన్ని తెలుగులో ‘వేటాడు వెంటాడు’ పేరుతో డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. విశాల్ సరసన త్రిష, సునయన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 21న విడుదల చేయాలనీ భావించారు. కానీ సారొచ్చారు విడుదలవుతుండటంతో ఈ సినిమాని ఒక వారం వాయిదా వేసి డిసెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు వాయిదా పడటంతో రవితేజ సారొచ్చారు సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వారం సారొచ్చారుతో పాటుగా గజరాజు సినిమా కూడా విడుదలవుతుంది. డిసెంబర్ 28న జీనియస్, వేటాడు వెంటాడు సినిమాలతో పాటుగా కో అంటే కోటి సినిమా కూడా విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు