సమాజానికి మేలు చేసే జీనియస్

సమాజానికి మేలు చేసే జీనియస్

Published on Nov 5, 2012 8:35 PM IST

నేటి యువతే రేపటి మన దేశ భవిష్యత్తు అని అంటుంటారు. అది అక్షరాలా నూటికి నూరు శాతం నిజం. అందులో ఎలాంటి అనుమానము లేదు, విద్యార్థులే రేపు దేశానికి కాబోయే లీడర్స్ కానీ మన వాళ్ళు పాలిటిక్స్ కంటే స్పోర్ట్స్ మరియు సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక్క యువకుడు మాత్రం దాన్ని మార్చాలనుకున్నాడు, స్టూడెంట్స్ సంక్షేమం కోసం పోరాడాలనుకున్నాడు. ఆ విషయాన్నే కథాంశంగా చేసుకొని ప్రముఖ యాంకర్ ఓంకార్ ‘జీనియస్’ అనే సినిమాని తీస్తున్నారు.

హవిష్ మరియు సనూష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అశ్విన్, అభినయ మరియు శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘ ఈ చిత్ర ఆడియోకి చాలా మంచి స్పందన లబిస్తోంది. సమాజానికి మేలుచేసే ఒక మంచి మెసేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించాం. త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని’ అన్నారు.

తాజా వార్తలు