మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న సీనియర్ హీరోస్ లో ఒకొక్కరి నుంచి పలు కల్ట్ క్లాసిక్ చిత్రాలు తమ కెరీర్లో ఉన్నాయి. కేవలం తెలుగు సినిమా నుంచే కాకుండా ఇండియా వైడ్ గా కూడా మంచి ఆదరణ ఉన్నవి అవి. అలా కింగ్ నాగార్జున కెరీర్లో ఉన్న చిత్రాల్లో గీతాంజలి ఇంకా శివ కూడా ఒకటి. ఒకటి కంప్లీట్ క్లాస్ క్లాసిక్ అయితే మరొకటి మాస్ క్లాసిక్.
మరి ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ విషయంలో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా జగపతిబాబు టాక్ షోలో హాజరైన నాగ్ ఈ ప్రశ్నకి “శివ 2” కి ఓటు వేశారు. ఎందుకంటే గీతాంజలి లో ఇద్దరు హీరో హీరోయిన్స్ చనిపోతారు. సో శివ 2 మాత్రమే చెయ్యగలం అంటూ తన మార్క్ సమాధానం అందించారు. ఇలా రెండిటిలో కింగ్ నాగ్ ఛాయిస్ గా ఇది నిలిచింది.