పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన హీరోగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మన రెబల్ స్టార్. ఆయన చేసే సినిమాలకు కేవలం టాలీవుడ్లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ పాన్ ఇండియా స్టార్ ఏదైనా సినిమా ఓకే చేశాడంటే, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని అభిమానులు నమ్ముతారు.
ఇలా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ నేడు(అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా విశేష అభిమానులు, సినిమా స్టార్స్ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ మ్యాషప్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ గురించి ఇచ్చిన ఎలివేషన్స్, ఆయన గురించి పలువురు స్టార్స్ చెప్పిన మాటలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.