నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ రోజు అని చెప్పాలి. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి బిగ్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా తెలియజేశారు. గీతా ఆర్ట్స్ ఇంత ప్రత్యేకంగా చెబుతున్న ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏమిటీ అనేది తెలియాల్సి వుంది. ఐతే అల్లు అర్జున్ 21వ చిత్ర ప్రకటన గురించే అని అందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. నేడు మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఈ ప్రకటన రానుంది.
కాగా ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న బన్నీ, తన నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన చేయలేదు. ఐతే దిల్ రాజ్ నిర్మాణంలో ఐకాన్ అనే మూవీలో అల్లు అర్జున్ నటించాల్సి వుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ మూవీ పోస్టర్ కూడా బన్నీ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బన్నీ మూవీ పై ప్రకటన చేయనున్నారని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
#StyleAndSubstance Coming Together ????
Stay tuned @ 12:55PM Today ????
— Geetha Arts (@GeethaArts) July 31, 2020