కష్టాలలో గౌతం మీనన్

కష్టాలలో గౌతం మీనన్

Published on Mar 12, 2014 1:08 AM IST

gautham_vasudeva_menon
గతకొన్నినెలలుగా గౌతంమీనన్ చాలా వివాదాలలో చిక్కుకున్నాడు. గతయేడాది ఆయనతో పనిచేసిన ఒక నిర్మాత తనకు హామీ ఇచ్చిన సినిమాలు చెయ్యలేదని కోర్టులో కేసు వేసాడు. చాలా కాలం సాగిన ఆ కేసు ఇటీవలే ఒక కొలిక్కివచ్చింది

ఇప్పుడు బ్యాంక్ నుంచి తెచ్చుకున్న డబ్బుకి వాయిదాలు కట్టట్లేదని బ్యాంక్ తన ఆస్థిని జప్తు చేసి వేలానికి పెట్టింది. ఆ ప్రాపర్టీ ఖరీదు దాదాపు 12కోట్లని, కొంతమంది దానిని కొనడానికి ఇష్టపడతున్నారని సమాచారం. గౌతం మీనన్ ఇప్పడు తన ఆస్తిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గౌతం మీనన్ త్వరలో అజిత్ తో తీయనున్న సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులలో వున్నాడు. ఈ సినిమా కాకుండా శింబు, పల్లవి సుభాష్ లు జంటగా నటించే సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు

తాజా వార్తలు