విడుదలైన గౌరవం టీజర్

విడుదలైన గౌరవం టీజర్

Published on Jan 10, 2013 6:20 PM IST

Gouravam

రాధామోహన్ రాబోతున్న చిత్రం “గౌరవం” టీజర్ ఈరోజు విడుదల చేశారు. అల్లు శిరీష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవ్వనున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతం కథానాయికగా కనిపించనుంది. సాయి చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సాంఘీక చిత్రం స్నేహితుడు కోసం పల్లెటూరుకి వెళ్ళిన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శిరీష్ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రీత సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్ర ఆడియో ఈ వారం విడుదల కానుంది.

తాజా వార్తలు