పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ

పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ

Published on Oct 15, 2012 7:45 PM IST


రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న చిత్రం “గౌరవం” దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్యాచ్ వర్క్ మరియు ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్నారు. కుల వ్యవస్థ మీద ఈ చిత్ర కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం ఈ చిత్రంలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పొల్లాచ్చిలో ఒక పాట మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకు వచ్చింది. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

తాజా వార్తలు