‘ఆకాశమంత’ మరియు ‘గగనం’ లాంటి చిత్రాలను తీసిన దర్శకుడు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైసూర్ లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోవడంతో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ త్వరలో చెన్నైలో ప్రారంభంకానుంది.” గౌరవం మొదటి షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం ఈ చిత్ర మొత్తం టీంతో మైసూర్ నుండి చెన్నై వెళ్తున్నాం. జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉందని” ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అల్లు శిరీష్ మరియు యామి గౌతం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రస్తుత యువత ఎదుర్కుంటున్న సమస్యల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.