ఏప్రిల్ మధ్యలో గౌరవం విడుదల

ఏప్రిల్ మధ్యలో గౌరవం విడుదల

Published on Apr 2, 2013 3:15 AM IST

Gouravam
అల్లు శిరీష్ మొదటి చిత్రం ‘గౌరవం’ ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో గానీ మూడో వారంలో గానీ విడుదల కావచ్చు. ఇటీవలే హైదరాబాద్లో కొన్ని సన్నివేశాలనూ, మిగిలిన ప్యాచ్ వర్క్ నీ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ పుట్ తో చిత్ర బృందం ఆనందంగా ఉంది. అల్లు శిరీష్ సరసన ఏమి గౌతం నటిస్తుంది. ఈ సినిమా హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో సాగుతుంది. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో రాధ మోహన్ తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న ప్రకాష్ రాజ్ ఇందులో ముఖ్య పాత్ర కుడా పోషిస్తున్నాడు .

సినిమా గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “గగనం, ఆకాశమంత సినిమాల తరువాత కధని నమ్ముకుని రాధ మోహన్ తీస్తున్న మరో సినిమా గౌరవం. ఏమి గౌతం పాత్రకు ప్రశంసలు అందుతాయి. ప్రీతా సినిమాటోగ్రఫీ, థమన్ నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని” తెలిపారు. ఈ సినిమా పట్నానికి, పల్లెటూరికి మధ్య నాగరికత తేడాను చూపే చిత్రమట. ఇందులో హీరొయిన్ ఒక యువ న్యాయవాది.

తాజా వార్తలు