ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడం మెగా అభిమానులని అయితే బాధించింది. ఇక థియేటర్స్ లో ఆల్రెడీ డల్ అయ్యిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇపుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
దీనితో ఈ చిత్రం ఈ రానున్న ఫిబ్రవరి 14 లేదా అంతకు ముందే వచ్చేస్తుంది అని తెలుస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో పాన్ ఇండియా భాషల్లోనే ఎంట్రీ ఇస్తుంది అని టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఎస్ జే సూర్య, శ్రీకాంత్ అలాగే జైరాం తదితరులు నటించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.