“గబ్బర్ సింగ్”నా లైఫ్ చేంజింగ్..ఆ వార్తల్లో నిజం లేదు – శృతి

“గబ్బర్ సింగ్”నా లైఫ్ చేంజింగ్..ఆ వార్తల్లో నిజం లేదు – శృతి

Published on Oct 6, 2020 12:05 PM IST

మన దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో శృతి హాసన్ కూడా ఒకరు. అనేక రకాల టాలెంట్స్ కలిగిన ఈ స్టార్ హీరోయిన్ విశ్వ నటుడు కమల్ కు తగ్గ కూతురు అనిపించుకుంది. అయితే శృతికి కూడా తన కెరీర్ ఆరంభంలో చేదు అనుభవాలు తప్పలేదు.

తెలుగులోనే కెరీర్ ను స్టార్ట్ చేసిన అమ్మడు హిట్ అందుకోడానికి టైం పట్టింది అనేక రిమార్క్స్ నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన “గబ్బర్ సింగ్” శృతికి ఒక్కసారిగా భారీ బ్రేక్ ను ఇచ్చింది. దీనితో పవన్ కు కానీ తెలుగు మరియు దక్షిణాది ఇండస్ట్రీకు కానీ శృతి ఎంతో విధేయతకు కట్టుబడి ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పింది.

కానీ ఇటీవలే ఒక జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో తాను చెప్పని మాటలను తెలుగు మరియు దక్షిణాది ఇండస్ట్రీలపై కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజమూ లేదని శృతి క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా తెలుగు “రేస్ గుర్రం”, “గబ్బర్ సింగ్” లాంటి హిట్ చిత్రాల్లో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాని పవన్ కళ్యాణ్ గారితో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్ అని శృతి తెలిపింది.

తెలుగు మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ నా గుండెల్లో భాగం అని ఆ ఇంటర్వ్యూ లో కేవలం హిందీ సినిమా కోసం చెప్పానే కానీ ఎక్కడా తెలుగు వర్సెస్ హిందీ అన్నట్టుగా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. గబ్బర్ సింగ్ టైం లో పవన్ మరియు శృతిల జంట ఎంత ఇంపాక్ట్ కలిగించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో వకీల్ సాబ్ లో నటించేందుకు శృతి ఓకె చెప్పింది.

తాజా వార్తలు