గత కొంత కాలంగా ఇదిగో అదిగో అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ త్వరలో పట్టాలెక్కనుంది. ఎక్కువ భాగం ఈ నెలలో లాంచనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి చేయనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్ గురించి అనౌన్స్ చేయగానే అందరూ గబ్బర్ సింగ్ 2 పై కొన్ని పుకార్లు మొదలయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
కానీ వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ నెల చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో జరగనున్నాయి. మేము కొద్ది వారాట క్రితం చెప్పినట్లు ఈ చిత్ర టీం ప్రస్తుతం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తోంది. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ చేయనున్నాడు. మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.