ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ సినిమా కోసం బయ్యర్లు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా మార్కెట్ బాగా జరిగింది. ఆంధ్రలో ఈ సినిమా థియేటర్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే సీడెడ్ ను 4 కోట్లకు అమ్మారు. ఇక నైజాం, వైజాగ్, కృష్ణలో శ్రీ స్రవంతి మూవీసే ఓన్ రిలీజ్ చేసుకుంటుంది. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.