అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై కసరత్తులు !

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. జూన్ మొదటి వారంలో ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ ప్లాన్ చేసారు. అఖిల్ ఫై ఈ స్టంట్స్ ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం అఖిల్ పై ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. ఈ సాంగ్ కోసం కూడా ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట.

మొత్తానికి లెనిన్ కోసం అఖిల్ బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version