‘విద్యా బాలన్’ కోసం ఆ పాత్ర రాసిన పూరి !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి హీరోగా ఓ సినిమా రాబోతుంది. నేటి రాజకీయాల పై ఈ చిత్రం ఉండబోతుందని.. పైగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయని.. నేటి సమాజానికి తగ్గట్టు పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. సహజంగా పూరి క్యారెక్టర్స్ లో డెప్త్ ఉంటుంది. మరి రాజకీయాల పై ఎలాంటి పాత్రలు రాశాడో చూడాలి.

ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం బలమైన కథను రాశాడట. మరి ఈ సినిమాతో పూరి ఏ రేంజ్ హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version