‘సీతా పయనం’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

యాక్షన్ కింగ్ అర్జు్న్ సర్జా డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేయగా ఇది సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘యే ఊరికెళ్తావే పిల్లా’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూలై 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తుండగా అర్జున్ సర్జా, ప్రకాష్ రాజ్, సత్య రాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version