విక్రమ్,జగపతి బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం “శివ తాండవం” చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజు హైదరాబాద్లో విడుదల చేశారు. విక్రం, జగపతి బాబు, ఏ ఎల్ విజయ్, కోట శ్రీనివాస రావు , జి వి ప్రకాష్, వనమాలి, సి కళ్యాణ్, ధనంజయన్ గోవింద్ మరియు వి టి వి గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు లో సి కళ్యాణ్, తేజ సినిమా బ్యానర్ మీద విడుదల చేస్తున్నారు. యూ టి వి మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విక్రమ్,జగపతి బాబు, ఏమి జాక్సన్, లక్ష్మి రాయి, కోట శ్రీనివాస రావు మరియు నాజర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ” జగపతి బాబు గారితో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది మీనా గారితో తను డాన్స్ చేస్తున్నప్పుడు సెట్ లో నేను ఉన్నాను అది నా తొలి అనుభవం ఇంకా గుర్తుంది. ఈరోజు ఆయనతో వేదికని పంచుకుంటున్నాను అంటే నాకు నమ్మశక్యంగా లేదు. విజయ్ ప్రతిభ కల దర్శకుడు “నాన్న” చిత్రం తరువాత తనతో కలిసి పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది” అని విక్రమ్ అన్నారు.”గత రెండు సంవత్సరాలుగా నేను మంచి చిత్రాల కోసం వేచి చూస్తున్నాను అప్పుడే విజయ్ ఈ చిత్రం తో నా వద్దకు వచ్చారు నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ బృందంతో పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది మరొక బాషలో ఒక నటుడిగా నాకు ఇది మరో జన్మ” అని జగపతి బాబు అన్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా నిరావ్ షా ఈ చిత్రానికి చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆగస్ట్ రెండవ వారంలో విడుదలవుతుండగా చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చెయ్యనున్నారు.