చివర దశ డబ్బింగ్ పనుల్లో ‘రన్ రాజా రన్’

చివర దశ డబ్బింగ్ పనుల్లో ‘రన్ రాజా రన్’

Published on Apr 9, 2014 1:26 PM IST

runrajarun

కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసి పేరుతెచ్చుకున్న శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రన్ రాజా రన్’. పాచ్ వర్క్ సీన్స్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఇటీవలే లాంచ్ చేసారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హీరో శర్వానంద్ ఈ సినిమాకి ప్రసాద్ లాబ్స్ లో డబ్బింగ్ చెబుతున్నాడు.డబ్బింగ్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.

సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ఎక్కువభాగం హైదరాబాద్, గోవాలలో షూట్ చేసారు. శర్వానంద్ స్టైలిష్ లుక్ లో మొబైల్స్ దొంగగా కనిపించనున్న ఈ సినిమాతో సీరత్ కపూర్ హీరోయిన్ గా పరిచయం కానుంది.

గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మధి సినిమాటోగ్రాఫర్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శర్వానంద్ ప్రస్తుతం ఈ సినిమా కాకుండా క్రాంతి మాధవ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

తాజా వార్తలు