ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘లాల్ సలాం’

ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘లాల్ సలాం’

Published on Jun 6, 2025 10:00 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ మధ్య నటించిన చిత్రాల్లో భారీ డిజాస్టర్ అయ్యిన చిత్రం “లాల్ సలాం” కూడా ఒకటి. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన నుంచి వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో విష్ణు విశాల్ అలాగే విక్రాంత్ సంతోష్ లు మెయిన్ లీడ్ లో కనిపించగా రజిని గెస్ట్ రోల్ చేశారు. అయితే ఈ చిత్రం ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది.

మినిమమ్ వాళ్ళు కూడా అందుకోలేక చతికల పడ్డ ఈ సినిమాని రజిని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది తర్వాత ఫైనల్ గా ఓటిటిలో విడుదలకి వచ్చింది. మధ్యలో సినిమా ఫుటేజ్ మిస్ అయ్యింది అని చాలా హంగామా నడిచింది. మళ్ళీ అది దొరకడంతో ఫైనల్ గా నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ లో వచ్చేసింది. అయితే కేవలం తమిళ్ లో మాత్రమే వచ్చిన ఈ సినిమాని చూడాలి అనుకునేవారు చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు