కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తను గెస్ట్ రోల్ లో నటించిన సినిమానే లాల్ సలాం. తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సోషల్ డ్రామా అనుకున్న రేంజ్ లో క్లిక్ అవ్వకపోగా భారీ డిజాస్టర్ అయ్యింది. అంతే కాకుండా చాలా హంగామా కూడా ఈ సినిమా విషయంలో నడిచింది.
ఫుటేజ్ ఉన్న డ్రైవ్ మిస్ అయ్యింది అని ఐశ్వర్య చెప్పడం దీనితో ఓటీటీ రిలీజ్ కూడా ఆగిపోవడం ఇలా చాలా తతంగం నడిచింది. అయితే ఫైనల్ గా లాల్ సలాం ఓటీటీ రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ కి వెళ్లగా అందులో ఈ జూన్ 8 లేదా 9 నుంచి అందుబాటులో ఉండనుందట. సో దీనిపై ఒక తుది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.