ప్రభాస్ కల ఇప్పుడు నెరవేరిందట.!

యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా తన భారీ చిత్రాలకు సంబంధించిన అప్డేట్ల వరద ఇపుడు వస్తుంది. అలా ఇపుడు ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో ఒకటైన తన 21వ చిత్రానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ను అందించారు. ఈ లెజెండరీ చిత్ర ప్రయాణంలో బాలీవుడ్ లెజెండరీ నటులు బిగ్ బి అమితాబ్ లేకుండా ఎలా అని మేకర్స్ ఆయనకు వెల్కమ్ చెప్పారు.

అయితే ఆయన వెల్కమ్ పట్ల ఈ చిత్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టా ద్వారా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మొత్తానికి నా కల నెలవేరింది అని ప్రభాస్ చెప్పాడు. ఆయనతో కలిసి స్క్రీన్ ను పంచుకోవడంతో ఇన్నాళ్లకు నా కల నెరవేరుతున్నట్టుగా ప్రభాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. మరి నాగశ్విన్ అమితాబ్ ను ఎలా చూపించనున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా దీపికా పదుకొనె ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version