‘ది రాజా సాబ్’ పై మొత్తానికి ఓ క్రేజీ న్యూస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రభాస్ నుంచి ఈ సినిమా ఫస్ట్ ఎవర్ హారర్ థ్రిల్లర్ గా వస్తుండగా ఈ చిత్రం టీజర్ పై మంచి హైప్ కూడా సెట్ అయ్యింది.

ఇక ఈ మే మధ్యలో సాలిడ్ అప్డేట్ ఉంటుంది అని దర్శకుడు మారుతీ కూడా హింట్ ఇవ్వగా ఫైనల్ గా ఈ చిత్రం టీజర్ పై ఓ పాజిటివ్ న్యూస్ బయటకి వచ్చింది. గత కొన్ని రోజులు నుంచి ప్రభాస్ విదేశాలలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ ఇపుడు హైదరాబాద్ కి తిరిగి చేరుకోగా ఇక వెంటనే టీజర్ తాలూకా డబ్బింగ్ ని స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీనితో టీజర్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసి రిలీజ్ చేయడమే తరువాయి అట. ఇక దీనితోనే సినిమా రిలీజ్ క్లారిటీ కూడా వస్తుంది అని ఇపుడు టాక్.

Exit mobile version